WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మపై సౌరబ్ గంగూలీ గుస్సా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ లోని ఓవల్ లో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతోంది.
ఈ మ్యాచులో ఆస్ట్రేలియా, టీమిండియాపై భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా భారత బౌలర్లు చేతులెత్తేయడంతో ట్రావిస్ హెడ్ 163 పరుగులు, స్టీవ్ స్మిత్ 121 పరుగులతో చెలరేగారు.
దీంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 469 పరగులు చేసి ఆలౌటైంది.
ఇక టెస్టు మ్యాచుల్లో స్మిత్ 31 సెంచరీలు చేసి రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై బ్రాడ్ మన్ 11 సెంచరీలు సాధిస్తే స్మిత్ 7 సెంచరీలు చేశాడు. ఇదే సమయంలో రాహుల్ ద్రవిడ్ ను స్మిత్ వెనక్కినెట్టాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచుపై బీసీసీఐ మాజీ బాస్ సౌరబ్ గంగూలీ స్పందించాడు.
Details
టీమిండియాకు మద్దతు పలికిన గంగూలీ
ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఉంటే ఇండియా పరిస్థితీ కూడా ఇలాగే ఉండేదని, టీమిండియాకు కాస్త మద్దతుగా గంగూలీ మాట్లాడారు.
పాట్ కమిన్స్ టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగ్ ఎంచుకొనేవాడని, ఒక జట్టు తొలి సెషన్ లోనే రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత 300 పరుగులు చేయడం ఇదేమీ తొలిసారి కాదని స్టార్ స్పోర్ట్స్‌తో గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఆసీస్ భారీ స్కోరు చేయడానికి రోహిత్ శర్మ నాయకత్వ లోపం ప్రధాన కారణమని, ఇది టెస్టు మ్యాచ్ అని ఐపీఎల్ కాదని ఎద్దేవా చేశాడు.