Page Loader
Dhoni: సాక్షి మాటలకు నవ్వు ఆపుకోలేని ధోనీ.. క్రికెట్‌ రూల్స్‌పై భార్యతో చర్చ!
సాక్షి మాటలకు నవ్వు ఆపుకోలేని ధోనీ.. క్రికెట్‌ రూల్స్‌పై భార్యతో చర్చ!

Dhoni: సాక్షి మాటలకు నవ్వు ఆపుకోలేని ధోనీ.. క్రికెట్‌ రూల్స్‌పై భార్యతో చర్చ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 29, 2024
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరుగా మాత్రమే కాకుండా అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి భారత్‌కు కీర్తి ప్రతిష్టతలు తెచ్చి పెట్టాడు. చెన్నై జట్టుకు ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత కూడా ధోనీకే దక్కింది. ఈ లెజెండరీ క్రికెటర్‌కు ఆయన సతీమణి సాక్షి క్రికెట్ రూల్స్ నేర్పించారని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ విషయాన్ని ధోనీనే వెల్లడించాడు. ఒకరోజు సాక్షి, తాను ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామని, మ్యాచ్‌లో బౌలర్ వైడ్ బాల్ వేశారన్నారు. బ్యాటర్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి షాట్ ఆడాడని, కీపర్ బంతిని అందుకుని స్టంపౌట్ చేశారని చెప్పారు.

Details

ఐపీఎల్ 2025లో ధోని ఆడే అవకాశం

అయితే, సాక్షి మాత్రం బ్యాటర్ అవుట్ కాదని చెప్పిందన్నారు. వైడ్ బాల్‌కి స్టంపౌట్ ఎలా ఇవ్వగలరని వాదన పెట్టుకుందన్నారు. తాను సాక్షికి వైడ్ బాల్‌కి స్టంపౌట్ చేయొచ్చని, నో బాల్ వేసినప్పుడు మాత్రమే స్టంపౌట్ కాదని వివరించానని ధోనీ చెప్పాడు. తాను ఎంత చెప్పినా, సాక్షి వినలేదని, తనకు క్రికెట్ గురించి ఏమీ తెలియదు అంటూ హేళన చేసిందన్నారు. ఇది విన్నాక చాలా నవ్వొచ్చిందని ధోని చెప్పుకొచ్చాడు. 2010లో ధోనీ, సాక్షిల వివాహం జరిగింది. వీరికి జీవా అనే కుమార్తె ఉంది. 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2025లో కూడా మహీ ఆడే అవకాశం ఉంది.