Page Loader
IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ? 
IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ?

IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2024
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభంఅయ్యి... మే 26న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ రూపొందించిందని సమాచారం. త్వరలోనే ఐపీఎల్ పై బీసీసీఐ అధీకారికంగా ప్రకటన చేయనుంది. మార్చిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండ‌డంతో ఎల‌క్ష‌న్ డేట్స్‌ వ‌చ్చాకే ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను వెల్లడించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. లోక్ సభ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఐపీఎల్ 2024ని విదేశాల్లో నిర్వహించవచ్చనే వార్త‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ ను ఇండియాలోనే జరిగేలా ప్లాన్ చేస్తోంది.

Details 

జూన్ 1 నుండి టీ20 ప్రపంచకప్

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే.. ఆ మ్యాచ్‌లను వేరే చోటికి మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉందట. 2024 జూన్ 1 నుండి జరగనున్న టీ20 ప్రపంచకప్ లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఆడనుంది. టీమిండియాకు విశ్రాంతి తీసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. కానీ జూన్ 2, 3, 4 తేదీలలో కొన్ని పెద్ద జట్లకు మ్యాచ్‌‌లు ఉన్నాయి. ఒక వేళ తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డులు భావిస్తే.. ఫైనల్‌కు విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది.

Details 

ఫిబ్రవరి 22 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్‌

ఇదే సమయంలో మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL)ను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. WPL 2024 మ్యాచ్‌లన్నీ బెంగళూరు, ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో 2-3 రోజుల్లో విడుదల కానుంది. WPL మొదటి సీజన్ ముంబై లో మాత్రమే జరిగింది. ప్రస్తుత సీజన్ లో రెండు వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. కాగా,ఫైనల్ మ్యాచ్ మాత్రం ఢిల్లీలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. WPL ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాంపియన్‌గా నిలిచింది.