
Moeen Ali : భారత్‌తో రెండో టెస్టు.. మోయిన్ అలీతో స్పిన్‌కు బలాన్ని పెంచిన ఇంగ్లండ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు రెండు జట్లు తమ తుది సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి. తొలి టెస్టులో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ అదే జోరును కొనసాగించాలని చూస్తుండగా.. భారత్ మాత్రం గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు మాజీ ఆల్‌రౌండర్ మోయిన్ అలీని కోచింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది. సోమవారం నుంచే మోయిన్ జట్టుతో కలిశాడని 'ది టెలిగ్రాఫ్' కథనం పేర్కొంది. ప్రస్తుతం ఇంగ్లండ్ తుది జట్టులో షోయబ్ బషీర్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు.
Details
స్పిన్ విభాగంలో బలంగా ఇంగ్లండ్
అయితే అతడు తొలి టెస్టులో ప్రభావం చూపలేకపోవడంతో.. అతనికి మద్దతుగా, స్పిన్ సంబంధిత అంశాల్లో మార్గదర్శకత్వం ఇవ్వడానికి మోయిన్‌ను తీసుకున్నారు. భారత బౌలింగ్ లైన్‌అప్‌లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా లాంటి నిపుణులున్న తరుణంలో.. వారిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మోయిన్ ఇంగ్లండ్ బ్యాటర్లకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు సహకరించనుందని సమాచారం. ఇదిలా ఉంటే.. భారత్ జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.
Details
ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాటే ప్రకారం.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాశ్ దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం లభించవచ్చునని జోరుగా చర్చ సాగుతోంది. ఇంతలోనే ఇంగ్లండ్ జట్టు తమ తుది జట్టును 48 గంటల ముందుగానే ప్రకటించి మరోసారి ఫోకస్‌ను ఆకర్షించింది. తొలి టెస్టులో ఆడిన 11 మందికే మరోసారి అవకాశం ఇచ్చారు. జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.