IND vs BAN 2nd Test: రెండో రోజు ఆట రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
కాన్పూర్ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు వర్షం ఒక్క బంతి పడకనే రద్దు అయింది.
భారీ వర్షం కారణంగా మైదానం పూర్తిగా తడిసిపోవడంతో ఆటను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
మధ్యాహ్నం 2 గంటలకు వర్షం తగ్గినా, ఔట్ ఫీల్డ్‌ను సరిచేయడం కష్టమని అంపైర్లు భావించి, రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం ఉదయం నుంచే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. రేపు ఆట కొనసాగే అవకాశం ఉన్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
ఇక ఇవాళ మధ్యాహ్నం లంచ్ సమయానికి ముందే ఇరు జట్లు హోటల్‌కు తిరిగి వెళ్లిపోయాయి.
Details
క్రీజులో మోమినల్ హక్, ముష్ఫికర్ రహీమ్
మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 107 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మొదటి రోజు వర్షం కారణంగా కేవలం 35 ఓవర్లు మాత్రమే సాగాయి.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీసి, జకీర్ హసన్ (0), షెడ్‌మన్ ఇస్లామ్ (24)లను ఔట్ చేశాడు.
అశ్విన్ మరో కీలక వికెట్ తీసి నజ్ముల్ హొస్సేన్ షాంటో (27)ను ఎల్బీడబ్ల్యుగా ఔట్ చేశాడు. మోమినల్ హక్ (40*), ముష్ఫికర్ రహీమ్ (6*) పటిష్టంగా ఆడుతూ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
వర్షం ప్రభావం కొనసాగుతున్న కారణంగా మూడో రోజు కూడా ఆట జరుగుతుందో లేదో వేచి చూడాలి.