SA vs IND : రేపే సఫారీలతో రెండో టెస్టు.. అశ్విన్, జడేజాను ఆడించాలి : భారత మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య రేపు కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత జట్టు విఫలమై, ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
దీంతో ఎలాగైనా రెండో టెస్టులో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది.
దీనికోసం ఇప్పటికే రోహిత్ సేన ప్రణాళికలను సిద్ధం చేసింది.
అయితే జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదటి టెస్టులో భారీగా పరుగులిచ్చిన శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) ను తుది జట్టు నుంచి తప్పించి రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ను కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikanth) పేర్కొన్నారు.
Details
శార్దుల్ ఠాకూర్ కంటే అశ్విన్ బెటర్ : శ్రీకాంత్
తానైతే అశ్విన్ తుది జట్టులోకి తీసుకుంటానని, శార్దుల్ కంటే అశ్విన్ బెటర్ అని కృష్ణమాచారి తెలిపారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే అశ్విన్, జడేజా ద్వయం అవసరమని, వారు సమిష్టిగా బౌలింగ్ చేసి 4-5 వికెట్లు పడగొడతారని చెప్పారు.
ఒక్క టెస్టు మాత్రమే ఆడిన ప్రసిద్ధ్ కృష్ణను ఇప్పుడు తుది జట్టు నుంచి తప్పించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, కేప్‌టౌన్‌లో భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య ఆరు టెస్టులు జరగ్గా, ఒక్కదాంట్లో కూడా భారత జట్టు విజయం సాధించలేదు.
4 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి.