LOADING...
Asian Champions Trophy 2024: వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్ 
వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్

Asian Champions Trophy 2024: వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
07:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల హకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 3-2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఈ విజయం ద్వారా దక్షిణ కొరియాకు ఈ టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. భారత జట్టు మ్యాచ్‌లో తొలి గోల్‌ను 3వ నిమిషంలో సంగీత కుమారి చేస్తే, 4వ నిమిషంలో దీపిక పెనాల్టీ స్ట్రోక్‌ ద్వారా రెండో గోల్‌ని నమోదు చేసింది. 56వ నిమిషంలో ఆమె మరో గోల్ చేసి భారత్‌ను 3-1 వద్ద ముందుకు నడిపించింది.

Details

3-2 తేడాతో భారత్ గెలుపు

దక్షిణ కొరియా తరఫున యూరి లీ 34వ నిమిషంలో గోల్ చేసి, 39వ నిమిషంలో చియోన్ యున్బీ పెనాల్టీ స్ట్రోక్‌తో మరో గోల్ చేసింది. మ్యాచ్ ముగిసే సమయానికి, భారత్ 2-0తో ఆధిక్యంలో ఉండగా, చివరికి 3-2తో విజయాన్ని సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే చైనా 5-0తో మలేషియాను ఓడించి టోర్నీలో తన రెండో విజయాన్ని సాధించింది.