
Kamindu Mendes: ఐపీఎల్ అరంగేట్రంలో సంచలనం.. కుడి, ఎడమ రెండు చేతులతో స్పిన్ అటాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ పోరులో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.
దీంతో సన్‌రైజర్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది.
Details
కమిందు మెండిస్ అరంగేట్రంలో అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. శ్రీలంక స్పిన్ బౌలర్ కమిందు మెండిస్ తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఎవరూ చేయని విధంగా కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. ఇది 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరిగింది.
అతడు మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.75 లక్షలకి వేలంలో దక్కించుకుంది.
వేర్వేరు చేతులతో బౌలింగ్ - ప్రేక్షకుల ఆశ్చర్యం
కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో వెంకటేష్ అయ్యర్ ఎడమచేతి బ్యాటర్ కావడంతో కమిందు మెండిస్ అతనికి కుడిచేతితో బౌలింగ్ చేశాడు.
మరో బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ కుడిచేతి వాటం బ్యాటర్ కావడంతో మెండిస్ అతనికి ఎడమచేతితో బౌలింగ్ వేశాడు.
Details
బ్యాటింగ్‌లో కేకేఆర్ విజృంభణ
ఒకే ఓవర్‌లో వేర్వేరు చేతులతో బౌలింగ్ చేయడం చూసిన ప్రేక్షకులు, కామెంటేటర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో వేగంగా 60 పరుగులు చేశాడు.
అంగ్క్రిష్ రఘువంశీ మరో అర్ధశతకం (50) సాధించి మద్దతుగా నిలిచాడు.
200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కుదేలు చేశారు.
బ్యాటింగ్‌లో హైదరాబాద్ జట్టు పూర్తిగా విఫలమైంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.