
Vaibhav Suryavanshi: బంతితో సంచలనం.. అండర్-19 టెస్టులో రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు మరో అద్భుతమైన యువ సత్తా కలిగిన ఆటగాడు లభించాడు. టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతిభను చాటాడు. ఇటీవల ముగిసిన యువ వన్డే సిరీస్‌లో దుమ్మురేపిన ఈ బుడతడు, తాజాగా మొదటి యూత్ టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం బాదడంతో పాటు బౌలింగ్‌లో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యువ టెస్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ వైభవ్ సూర్యవంశీ రెండు కీలక వికెట్లు తీశాడు.
Details
అత్యంత పిన్న వయస్స్కుడిగా రికార్డు
ఇంగ్లండ్ కెప్టెన్ హంజా షేక్ (84), థామస్ రెవ్ (34)లను పెవిలియన్‌కు పంపించాడు. ఈ క్రమంలో భారత అండర్-19 టెస్టు చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో వికెట్ తీసిన ఆటగాడిగా (14 ఏళ్లు 107 రోజులు) అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఆయుష్ మాత్రే (102) మెరుపు శతకంతో చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీగా 540 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 439 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌కు 101 పరుగుల ఆధిక్యం లభించింది.
Details
ఇంగ్లండ్ ముందు 350 పరుగుల లక్ష్యం
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 248 పరుగులు చేసి, ఇంగ్లాండ్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే మ్యాచ్ చివరి రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైభవ్ ప్రతిభ యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తోంది. ఈ వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించడం నిజంగా అభినందనీయమైన విషయం.