Asian Games : సెయిలింగ్‌లో సంచలన రికార్డు.. భారత్‌కు మరో మెడల్
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. సెయిలింగ్ ILCA-4 ఈవెంట్‌లో భారతీయ సెయిలర్ నేహా థాకూర్ సిల్వర్ మెడల్ సాధించింది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఆమె ఈ మెడల్‌ను సాధించింది. 11 రేసుల్లో ఆమె 32 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. భోపాల్‌లోని నేషనల్ సెయిలింగ్ స్కూల్‌లో నేహా థాకూర్ సెయిలర్‌గా శిక్షణ పొందింది. ఈ ఈవెంట్లో థాయిలాండ్‌కు చెందిన నొప్పసొరన్ కన్బుంజన్ స్వర్ణ పతకం గెలిచింది. ఇక సింగపూర్ కు చెందిన కీరా మేరీ కార్లైస్ 28 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
గతేడాది ఆసియా ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన నేహా థాకూర్
సెయిలింగ్‌లో భారత్ కు మెడల్ దక్కడం ఇదే తొలిసారి. ఐఎల్‌సీఏ-4 క్యాటగిరీలో మొత్తం 11 రేసులు ఉంటాయి. అయితే ఐదో రేసేలో నేహాకు చాలా తక్కువ పాయింట్లు వచ్చాయి. ఆ రేసులో ఆమె కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ జిల్లా అమల్‌తాజ్ కు చెందిన నేహా థాకూర్ గతేడాది ఆసియా ఛాంపియన్‌షిప్ లోనూ కాంస్య పతకం సాధించింది.