Page Loader
మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై  అలెక్సిస్‌ ప్రశంసలు
అక్కకి చెల్లిని పరిచయం చేయడం మర్చిపోలేనని ట్వీట్

మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై  అలెక్సిస్‌ ప్రశంసలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 23, 2023
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మరోసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అలెక్సిస్‌ ఒహానియన్‌ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు రెండో పాపకు పేరు కూడా పెట్టామని, ఈ మేరకు తనను అధీరా రివర్‌ ఒహానియన్ అని పిలుస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇల్లంతా సవ్వడితో, ఆనందంతో నిండిపోయిందన్నారు. మరో అద్భుతమైన బహుమతిని అందించావని భార్య సెరెనాపై అలెక్సిస్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట సందడి చేస్తోంది. సెరెనా అలెక్సిస్‌ దంపతులకు ఇప్పటికే ఓ ఆరేళ్ల పాప ఉంది. అయితే పెద్ద కుమార్తెకు, తన చెల్లిని పరిచయం చేయడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందన్నారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

సెరెనా విలియమ్స్ ట్వీట్