Shaheen Shah Afridi: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు. అలాగే,టీ20ల్లో వంద వికెట్లు సాధించిన బౌలర్‌గా కూడా షాహీన్ అఫ్రిది ప్రత్యేక ఘనత సాధించాడు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకుని టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని దాటాడు. టీ20లతో పాటు వన్డేలు,టెస్టుల్లో కూడా అఫ్రిది వందకు పైగా వికెట్లు సాధించాడు. ఇప్పటివరకు వన్డేల్లో 112 వికెట్లు,టెస్టుల్లో 116 వికెట్లు తీసుకున్నాడు.
మూడో పాకిస్థాన్ బౌలర్‌గా షాహీన్
టీ20ల్లో వంద వికెట్లు సాధించిన మూడో పాకిస్థాన్ బౌలర్‌గా షాహీన్ నిలిచాడు. అతనికంటే ముందు హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ ఈ మైలురాయిని చేరుకున్నారు. మొత్తం 74 టీ20 మ్యాచ్‌ల్లో షాహీన్ వంద వికెట్లు సాధించగా, అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన బౌలర్లలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ, బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ కూడా ఉన్నారు.