Shahid Afridi: టీమిండియాపై షాహిద్ ఆఫ్రిది తీవ్ర విమర్శలు
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. వరుసగా 10 మ్యాచుల్లో నెగ్గిన భారత్, ఫైనల్ మ్యాచులో మాత్రం చేతులెత్తేసింది. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించాడు. వరుసగా మ్యాచులు గెలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందని, అదే భారత్ పతనానికి దారి తీసిందని షాహిద్ అఫ్రిది నోరుపారేసుకున్నారు. ఒకవేళ భారత్ మ్యాచ్ ఓడిపోతే అందుకు కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ యే అంటూ భారత జట్టుపై విమర్శలు కురిపించాడు.
టీమిండియా ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్స్ యే కారణం
ప్రస్తుతం షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఫైనల్ మ్యాచులో ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సయమంలోనే షాహిది ఈ వ్యాఖ్యలను చేశాడు. ఇదిలా ఉండగా, ఫైనల్ మ్యాచులో టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.