Shakib Al Hasan: అరుదైన ఘనత సాధించిన షకీబ్ అల్ హసన్.. మూడో ఆటగాడిగా!
ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచులో పాక్‌పై 57 బంతుల్లో 53 పరుగులు చేసి, షకీబ్ ఆసియాలో 4వేల పరుగులు పూర్తి చేసిన మూడో బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్ కేవలం 31 పరుగుల వద్ద మెహిదీ హసన్ మిరాజ్, లిట్టన్ దాస్ వికెట్ కోల్పోయిన తర్వాత షకీబ్ క్రీజులోకి వచ్చాడు. ఇక మహ్మద్ నయీమ్, తౌహిద్ హృదయ్ ఔట్ అయినప్పటికీ షకీబ్ ముష్ఫికర్ రహీమ్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా వన్డేల్లో 54వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.
బౌలింగ్ విభాగంలో 207 వికెట్లను షకీబ్
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 193 పరుగులకు ఆలౌటైంది. అయితే పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షకీబ్ వన్డేల్లో 4,000 ODI పరుగులు చేసిన మూడవ బంగ్లాదేశ్ బ్యాటర్‌గా నిలిచాడు. తమీమ్ ఇక్బాల్ (4,735), ముష్ఫికర్ (4,546) తర్వాతి స్థానంలో అతను నిలిచాడు. ఇప్పటివరకూ 144 మ్యాచుల్లో 4,008 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌లో ఏడు వన్డేలు ఆడిన షకీబ్ 46.16 సగటుతో 277 పరుగులు చేశాడు. ఇక భారత్‌లో మూడు వన్డేల్లో 51.50 సగటుతో 103 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో షకీబ్ 4.16 ఎకానమీతో ఆసియాలో 207 వన్డే వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్లను తీశాడు.