Page Loader
Shakib al Hasan : ష‌కీబ్ అల్ హ‌స‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. టెస్టులు, వ‌న్డేలు, టీ20ల‌కు వీడ్కోలు
ష‌కీబ్ అల్ హ‌స‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. టెస్టులు, వ‌న్డేలు, టీ20ల‌కు వీడ్కోలు

Shakib al Hasan : ష‌కీబ్ అల్ హ‌స‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. టెస్టులు, వ‌న్డేలు, టీ20ల‌కు వీడ్కోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాన్పూర్ వేదికగా శుక్రవారం భారత్-బంగ్లాదేశ్ జట్లు ఎదుర్కొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో, గురువారం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అనూహ్య నిర్ణయం ప్రకటించాడు. ఆయన టీ20, టెస్టు, వన్డే ఫార్మాట్‌లకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. టీ20లలో తన రిటైర్‌మెంట్ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుందని పేర్కొన్నారు. టెస్టుల్లో, తన సొంత దేశంలో సౌతాఫ్రికాతో ఆడే చివ‌రి మ్యాచ్ ఆడ‌నున్న‌ట్లు చెప్పాడు. షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు అక్టోబర్‌లో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మీర్పూర్ వేదికగా జరిగే చివరి టెస్టు తన కెరీర్లో ఆఖరిగా ఉండబోతోందని చెప్పారు. "మిర్పూర్‌లో నా చివరి టెస్టు ఆడాలనే కోరికను బీసీబీకి తెలియజేశాను. వారు దీనికి అంగీకరించారు.

వివరాలు 

హత్య కేసు నిందితుల్లో షకీబ్

నేను బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని వారు చెప్పారు.అయితే, భద్రతాపరమైన ఆందోళనలు మాకు ఆటంకం కలిగిస్తే,కాన్పూర్‌లో భారత్‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్ నా కెరీర్‌లో చివరిది అవుతుంది" అని ఆయన తెలిపారు. వన్డేల్లో,2025లో పాకిస్థాన్‌లో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తనకు చివరిది అని వెల్లడించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో షకీబ్ ఎంపీగా ఉన్నాడు. అయితే, తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా దేశం విడిచి వెళ్లారు. ఆమె ప్రభుత్వం రద్దయ్యాక,షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి రాలేదు.ఓ హత్య కేసులో 147 నిందితుల్లో షకీబ్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో,అతను బంగ్లాదేశ్‌కు వెళ్లి తిరిగి వస్తాడా లేదా అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.