LOADING...
Sl vs BAN: షకీబ్ రాళ్లతో సన్మానం చేస్తాం.. మాథ్యూస్ సోదరుడి హెచ్చరికలు
షకీబ్ రాళ్లతో సన్మానం చేస్తాం.. మాథ్యూస్ సోదరుడి హెచ్చరికలు

Sl vs BAN: షకీబ్ రాళ్లతో సన్మానం చేస్తాం.. మాథ్యూస్ సోదరుడి హెచ్చరికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2023
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో టైమ్డ్ ఔట్ తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకీబ్ వ్యవహరించిన తీరుపై శ్రీలంక సీనియర్ ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్ అనంతరం అగ్రహం వ్యక్తం చేశాడు. షకీబ్ ఆటతీరుకు విరుద్ధంగా వ్యవహరించాడని సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తాయి. తాజాగా ఈ ఘటనపై ఏంజెలో మాథ్యూస్ సోదరుడు ట్రెవిస్ మాథ్యూస్ స్పందించాడు. షకీబ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని, అందుకు అతడు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వెల్లడించాడు. షకీబ్ ను లంక్ ఫ్యాన్స్ అంత త్వరగా మరిచిపోరని మాథ్యూస్ సోదరుడు పేర్కొన్నాడు.

Details

షకీబ్ ను శ్రీలంకకు రానివ్వం

మాథ్యూస్ ఓట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని, షకీబ్ ను శ్రీలంకలోకి రానివ్వమని ట్రెవిస్ వ్యాఖ్యనించాడు. ఇలాంటి ఘటనలు షకీబ్ తో పాటు ఆ జట్టు నుంచి తాము ఆశించలేదని, ఒకవేళ అంతర్జాతీయ మ్యాచ్ లేదా ఎల్ పీఎల్ లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలు తప్పవని వెల్లడించారు. మాథ్యూస్‌ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ క్రమంలోనే బంగ్లా జట్టు 'టైమ్‌డ్‌ ఔట్‌' కోసం అప్పీల్‌ చేసింది. ఆ అప్పీల్‌ను పరిశీలించిన అంపైర్‌.. మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. హెల్మెట్‌ బాగా లేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్‌ వివరించినా.. అంపైర్ల నిర్ణయం మారలేదు.