Page Loader
2022లో ప్రముఖ లెంజెండరీ ప్లేయర్లు కన్నుమూత
షేన్ వార్న్, అండ్రూ సైమండ్స్

2022లో ప్రముఖ లెంజెండరీ ప్లేయర్లు కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2022
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022 క్రీడారంగంలో తీవ్ర విషాదం నింపింది. వరుసగా దిగ్గజ ప్లేయర్ల మరణాలు అభిమానుల గుండెల్లో శోకాన్నిమిగిల్చాయి. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ (52) మార్చి4న మృతి చెందాడు. థాయ్‌లాండ్‌ని తన విల్లాలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన అతని సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వార్నర్ మరణించిన రెండు నెలల తర్వాత మరో లెజెండరీ క్రికెటర్ సైమండ్స్ మరణించాడు. మే14న కారు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మరణాన్ని కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బాస్కెట్ బాల్ ఆటగాడు బిల్ రస్సెల్ 1957-69 వరకు 13 సీజన్లలో ఆడి 11 ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. ఆయన జూలై 31న మరణించాడు. ఆయన మరణం బాస్కెట్ బాల్ అభిమానుల్లో తీరని శోకాన్ని నింపింది.

చరణ్‌జిత్ సింగ్

భారత మాజీ హకీ జట్టు కెప్టెన్ కన్నుమూత

పాకిస్థాన్‌కు చెందిన మాజీ ICC ప్యానెల్ ఎలైట్ అంపైర్ రవూఫ్ సెప్టెంబర్ 14న లాహోర్‌లో గుండెపోటుతో మరణించాడు. ఆయన తన కెరీర్‌లో 64 టెస్టులు, 139 వన్డేలు, 28 T20Iలకు ఆంపైర్ గా పనిచేశారు. అంపైర్ కాకముందు, అతను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా 71 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. డిసెంబర్ 4న, గొప్ప టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన నిక్ బొల్లెట్టియేరి కన్నుమూశారు. షరపోవా, ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్ వంటి క్రీడాకారులు ప్రపంచ నంబర్ 1గా నిలిచేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. 1964లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న హాకీ జట్టు కెప్టెన్ చరణ్‌జిత్ సింగ్ జనవరి 27న గుండెపోటుతో కన్నుమూశారు.