LOADING...
IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచుకు దూరం కానున్న శార్దూల్, కాంబోజ్?
ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచుకు దూరం కానున్న శార్దూల్, కాంబోజ్?

IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి మ్యాచుకు దూరం కానున్న శార్దూల్, కాంబోజ్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగే చివరి టెస్టు మ్యాచ్‌ కోసం భారత జట్టు కొన్ని కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, యువ పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌లకు తుది జట్టులో చోటు లేకపోవచ్చని తెలుస్తోంది. టెస్ట్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో నిరాశాజనక ప్రదర్శన ఇచ్చిన శార్దూల్‌ను ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్కన పెట్టింది. అయితే నితీశ్‌ రాణా, ఆకాశ్‌దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ల గాయాల కారణంగా ఆయనకు నాల్గో టెస్టులో మరో అవకాశం లభించింది. బ్యాటింగ్‌ విభాగంలో శార్దూల్‌ ఓ మాదిరిగా రాణించినప్పటికీ, బౌలింగ్‌ వైఫల్యం మరోసారి పునరావృతమైంది.

Details

నిరాశపరిచిన అన్షుల్ కాంబోజ్

రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయాడు. పైగా సాధారణంగా చేసేలా ఈ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్‌ ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన అన్షుల్‌ కాంబోజ్‌ కూడా పూర్తిగా నిరాశపరిచాడు. వేగం లోపించడంతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు అతని బంతులను సులభంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కేవలం ఒక వికెట్‌కే పరిమితమయ్యాడు.