LOADING...
Pakistan: జపాన్ ఎయిర్‌పోర్టులో షాక్‌.. నకిలీ పాస్‌పోర్టులతో పాక్‌ ఫుట్‌బాల్‌ జట్టు దొరికిపోయింది!
జపాన్ ఎయిర్‌పోర్టులో షాక్‌.. నకిలీ పాస్‌పోర్టులతో పాక్‌ ఫుట్‌బాల్‌ జట్టు పట్టుబాటు!

Pakistan: జపాన్ ఎయిర్‌పోర్టులో షాక్‌.. నకిలీ పాస్‌పోర్టులతో పాక్‌ ఫుట్‌బాల్‌ జట్టు దొరికిపోయింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌లో నకిలీ పాస్‌పోర్టులతో పాక్‌ ఫుట్‌ బాల్‌ జట్టు పేరుతో వెళ్ళిన 22 మందిని వెనక్కి పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మానవ అక్రమ రవాణా ప్రయత్నంగా భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పాకిస్థాన్‌ సియాల్‌కోట్‌ విమానాశ్రయం నుంచి ఫుట్‌బాల్‌ జట్టు పేరుతో 22 మంది జపాన్‌కు వెళ్లారు. అయితే అక్కడి అధికారులు వారి పాస్‌పోర్టులు నకిలీవని గుర్తించి వారిని డిపోర్ట్ చేశారు.

Details

పాక్ ను హెచ్చరించిన జపాన్

ఈ పరిణామాలపై జపాన్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌కు హెచ్చరిక జారీ చేసినట్లు చేసినట్లు తెలిసింది. నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంలో మానవ అక్రమ రవాణా యత్నం దాగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ఘటన భారత క్రికెట్‌ జట్టు ఆసియా కప్‌-2025లో సెప్టెంబర్‌ 14న దుబాయ్‌లో పాక్‌పై సాధించిన విజయానంతరం కరచాలనం నిరాకరించిన నేపథ్యంతో వెలుగులోకి రావడం. పాక్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (FIA) ఈ ఘటొనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.