Page Loader
టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం
మూడ్రోజులు విశ్రాంతి తీసుకోనున్న టీమిండియా ప్లేయర్లు

టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో వన్డే సిరీస్ ను భారత్ కోల్పోయింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, టీమిండియాపై 21 పరుగులు తేడాతో గెలుపొందింది. వరుస పర్యటన నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు కాస్త విరామం లభించింది. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్ ఫ్రాంచేజీల్లో చేరడానికి ముందు కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు మూడు, నుంచి నాలుగు రోజుల పాటు విరామం తీసుకున్నారు. కొంతమంది ఆటగాళ్ళు నేరుగా ఐపీఎల్లో పాల్గొననున్నారు. అయితే IPL జట్లతో చేరడానికి ముందు మూడు-నాలుగు రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఐపీఎల్

కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం

ఇప్పటికే కొన్ని ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కొంతమంది ప్లేయర్ ఐపీఎల్ మొత్తం సీజన్ కు దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. అతనికి బ్యాక్ సర్జరీ కారణంగా ఐపీఎల్ లో పాల్గొనడం లేదని ఇప్పటికే బోర్డు వర్గాలు తెలిపాయి. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటికే శస్త్రచికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఐపీఎల్‌ కోసం మైదానంలో కష్టపడుతున్న విషయం తెలిసిందే.