Page Loader
Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత

Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌పై విజయం ద్వారా 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు విభిన్న జట్లను ప్లేఆఫ్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో పంజాబ్‌ కింగ్స్‌ 17 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. నెహాల్ వధేరా 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 పరుగులు చేయగా, శశాంక్ సింగ్ 30 బంతుల్లో 59 నాటౌట్‌ (5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు.

Details

జైస్వాల్, సూర్యవంశీ పోరాటం వృథా

రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీయగా, మఫకా, పరాగ్, మధ్వాల్ ఒక్కొక్క వికెట్ తీసారు. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 209 పరుగులకే పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50), ధ్రువ్ జురెల్ (31 బంతుల్లో 53), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40) శ్రేష్ఠంగా రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3/22తో మెరిశాడు. మార్కో జాన్సెన్, ఒమర్జాయ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయం పాటు ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడం కూడా పంజాబ్‌కు కలిసొచ్చింది.

Details

ఫ్లే ఆఫ్స్ అర్హత సాధించిన ఆర్సీబీ, గుజరాత్, పంజాబ్

ఫలితంగా పంజాబ్ కింగ్స్‌తో పాటు ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాయి. ఇక మిగిలిన ఒక్క ప్లేస్ కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా ప్లేఆఫ్స్‌కు చేర్చిన విషయం తెలిసిందే. అంతేకాక, గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నాయకత్వం వహించి టైటిల్‌ను అందించాడు. తాజాగా పంజాబ్‌ను 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కి చేర్చడంతో అతను మూడు వేర్వేరు జట్లకు ప్లేఆఫ్స్‌ అర్హత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు.