Page Loader
ICC ODI Rankings: సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్.. దూసుకొచ్చిన తిలక్‌ వర్మ
సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్

ICC ODI Rankings: సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్.. దూసుకొచ్చిన తిలక్‌ వర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు. విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యువ ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్ తమ కెరీర్‌లోనే బెస్ట్ రేటింగ్ పాయింట్లను సాధించారు. ఇక టీ20 సిరీస్‌లో దుమ్మురేపుతున్న తిలక్ వర్మ ర్యాంకింగ్స్ లో భారీ జంప్ కొట్టాడు. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో కలిపి 126 పరుగులు చేసిన గిల్ 2 స్థానాలను మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇక ఈ మూడు మ్యాచుల్లోనూ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించిన ఇషాన్ కిషన్ 9 స్థానాలను మెరుగుపర్చుకొని 36వ స్థానానికి చేరుకున్నాడు.

Details

46వ స్థానంలో తిలక్ వర్మ

ఇక టీ20ల్లో ఇప్పటివరకూ విండీస్‌తో మూడు మ్యాచులాడిన తిలక్ వర్మ అరంగేట్రంలోనే 21 స్థానాలను మెరుపర్చుకొని 46వ స్థానానికి చేరాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నికోలస్ పూరన్ ఆరు స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌, విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 17 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్‌కు చేరుకున్నారు. విండీస్ సిరీస్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్ యాదవ్ ఏకంగా 36 స్థానాలను మెరుగుపర్చుకొని 51 స్థానానికి చేరాడు. కుల్దీప్‌ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ 4 స్థానాలను మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకాడు.