LOADING...
Shubman Gill: శుభ్‌మాన్ గిల్‌కి గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే..?
శుభ్‌మాన్ గిల్‌కి గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే..?

Shubman Gill: శుభ్‌మాన్ గిల్‌కి గాయం.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా కప్‌ 2025 కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపికైన శుభమన్ గిల్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. చేతికి గాయం కావడంతో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికే యూఏఈపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత టచ్‌లో కనిపించిన గిల్ గాయం జట్టులో ఆందోళన పెంచింది. గాయం తగిలిన వెంటనే నెట్స్‌లో గందరగోళం నెలకొంది. జట్టు ఫిజియో వెంటనే అతని వద్దకు చేరుకొని గాయాన్ని పరీక్షించాడు. గిల్ చేతిని పట్టుకుని నెట్స్‌ నుండి బయటికి వచ్చాడు. తర్వాత ఐస్ బాక్స్‌పై కూర్చుని కనిపించాడు. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అతని గాయం గురించి ఆరా తీశారు.

Details

గిల్ గాయం తీవ్రత ఎంత? 

అయితే గిల్ గాయం పెద్దది కాదని తేలింది. కొద్ది సేపటికి మళ్లీ నెట్స్‌లోకి తిరిగి వచ్చి సాధన కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో కూడా జట్టు ఫిజియో నిరంతరం అతనిపై నిఘా ఉంచాడు. మొత్తం మీద, టీమిండియా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.