Page Loader
AUS vs IND: గిల్ గాయంపై అప్‌డేట్‌.. తొలి టెస్టు ఉదయమే ఆడటంపై నిర్ణయం: భారత కోచ్ 
గిల్ గాయంపై అప్‌డేట్‌.. తొలి టెస్టు ఉదయమే ఆడటంపై నిర్ణయం: భారత కోచ్

AUS vs IND: గిల్ గాయంపై అప్‌డేట్‌.. తొలి టెస్టు ఉదయమే ఆడటంపై నిర్ణయం: భారత కోచ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2024
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో (AUS vs IND) భారత జట్టులో ఎవరు ఆడతారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. వన్‌డౌన్ బ్యాటర్ శుభమన్ గిల్ (Shubman Gill) ఆడతాడా? లేదా? అనే అంశం సందిగ్ధంగా ఉంది. వార్మప్ మ్యాచ్ సమయంలో గిల్ వేలికి గాయమైంది. తర్వాత ఆయన నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేయలేదన్న వార్తలు వినిపించాయి. స్కానింగ్‌లో గాయానికి సంబంధించిన చీలికలు ఉన్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. తాజాగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) గిల్ గాయంపై స్పందిస్తూ అతడి పరిస్థితి మెరుగవుతుందన్నారు.

వివరాలు 

 మహ్మద్ షమీ పునరాగమనంపై మోర్కెల్ 

"గిల్‌ను నిశితంగా గమనిస్తున్నాం.అతడి పరిస్థితి మెరుగవుతోంది.అయితే,అతడిని మొదటి టెస్టులో ఆడించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మ్యాచ్ ప్రారంభం రోజు గిల్ ఆడతాడా లేదా అనేది నిర్ణయిస్తాం. ప్రాక్టీస్‌లో అతడు ఇబ్బంది లేకుండా ఆడాడు. అతడిపై మేము సానుకూలంగా ఉన్నాం" అని మోర్కెల్ తెలిపారు. అలాగే, బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనంపై కూడా మోర్కెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. "షమీ దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అతడు తిరిగి జట్టులో చేరడం భారత జట్టుకు విజయవంతమైన అంశం. షమీ ప్రపంచ స్థాయి బౌలర్. దేశవాళీ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని మళ్లీ నిరూపించాడు" అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.