
IND Vs NZ: శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్.. టీమిండియా 263 పరుగులకే ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.
ప్రస్తుతం టీమిండియా 28 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు వికెట్లతో రాణించాడు.
భారత బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మన్ గిల్ 90 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు, రిషబ్ పంత్ 60 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
మరోవైపు యశస్వి జైస్వాల్ (30), వాషింగ్టన్ సుందర్ (38 నాటౌట్) రాణించారు.
Details
నిరాశ పరిచిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా
మిగతా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (18), రవీంద్ర జడేజా (14), రవిచంద్రన్ అశ్విన్ (06), సర్ఫరాజ్ ఖాన్ (0), మహ్మద్ సిరాజ్ (0), ఆకాశ్ దీప్ (0) తక్కువ పరుగులతోనే వెనుదిరిగి నిరాశపరిచారు.
న్యూజిలాండ్ బౌలింగ్‌లో అజాజ్ పటేల్ ఐదు కీలక వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు.
ఇక మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధీ తలో వికెట్ సాధించి తమ పాత్ర పోషించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీమిండియా ఆలౌట్
3RD Test. WICKET! 59.4: Akash Deep 0(0) Run Out Rachin Ravindra, India 263 all out https://t.co/Vz7cIv1znY #INDvNZ @IDFCFIRSTBank
— BCCI (@BCCI) November 2, 2024