Page Loader
శుభ్‌మాన్ గిల్‌కి షాకిచ్చిన ఐసీసీ.. టీమిండియాకు భారీ జరిమానా
టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌

శుభ్‌మాన్ గిల్‌కి షాకిచ్చిన ఐసీసీ.. టీమిండియాకు భారీ జరిమానా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2023
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మ్యాచు ఫీజులో వందశాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అటు ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా తప్పలేదు. స్లో ఓవరు రేటు కారణంగా ఆసీస్ జట్టుకు మ్యాచు ఫీజులో 80శాతం కోత పడింది. భారత్ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేశాయని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ కు ఐసీసీ అదనపు జరిమానా విధించడం గమనార్హం. ఐసీసీ నిబంధనల్లోని 2.7 నియమాన్ని గిల్‌ ఉల్లంఘించాడని ఐసీసీ పేర్కొంది.

Details

గిల్ కు 115శాతం జరిమానా

టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో గిల్ వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. గ్రీన్ పట్టిన క్యాచ్ నేలకు తాకుతున్నట్లు టీవీ స్పష్టంగా కనిపించిప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై గిల్ తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. బంతి నేలను తాకుతున్నట్టుగా కనిపించే ఫోటోను జత చేసి, రెండు భూతద్దాలు, తలను చేత్తో కొట్టుకుంటున్న ఎమోజీలను పెట్టాడు. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గిల్ కు అదనపు జరిమానా పడింది. మొత్తంగా గిల్ కు మ్యాచు ఫీజులో 115 శాతం కోత పడింది.