ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులివే..!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. పాట్ కమిన్స్ సారథ్యంలో టీమిండియాను 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఈ ఫైనల్లో మొదటి రోజు నుంచి ఆసీస్ అధిపత్యం ప్రదర్శించింది. WTC పాయింట్ల పట్టికలో ఆసీస్ 66.67శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో ఆస్ట్రేలియా 19 మ్యాచులు ఆడగా.. 11 విజయాలను నమోదు చేసింది. ఇండియా రెండోస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడింది. ఇందులో ఒక సిరీస్ ను మాత్రమే ఆసీస్ ఓడిపోయింది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పై 4-0తో, వెస్టిండీస్‌పై 2-0తో, పాకిస్థాన్‌పై 1-0తో విజయం సాధించిన విషయం తెలిసిందే.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నాథన్ లియాన్
WTC ఫైనల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్ల జాబితాతలో నలుగురు ఆస్ట్రేలియా బ్యాటర్లు టాప్ 10 ఉండడం విశేషం. ఉస్మాన్ ఖవాజా 64.84 సగటుతో 1,621 పరుగులతో రెండో స్థానం, మార్నస్ లాబుస్చాగ్నే 1,576 పరుగులతో మూడో స్థానం, స్టీవ్ స్మిత్ 1,407 రన్స్ తో నాలుగో స్థానం, ట్రావిస్ హెడ్ 1,389 పరుగులతో ఐదో స్థానంలో నిలిచారు. టాప్ 10లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. నాథన్ లియాన్ 20 టెస్టుల్లో 26.12 సగటుతో 88 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కమిన్స్ 57 వికెట్లు, మిచెల్ స్టార్క్ 55 వికెట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు.