Page Loader
క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన సింధు, ప్రణయ్
క్వార్టర్స్ కి అర్హత సాధించిన పీవీ సింధు

క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2023
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్లు పీవీ.సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సత్తా చాటారు. క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించి శబాష్ అనిపించారు. ఇక ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కిందాబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ లో గురువారం ఎనిమిదో సీడ్ సింధు 21-12, 21-15తో హన్‌ హుయ్‌ (చైనా)ను ఓడించింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 33 నిమిషాల్లోనే విజయాన్ని అందుకోవడం విశేషం. అదే విధంగా పురుషుల సింగిల్స్ లో ప్రిక్వార్టర్స్ లో ప్రణయ్ 21-16, 5-21, 21-18తో ఆరా వార్డోయో (ఇండోనేసియా)పై ఘన విజయం సాధించాడు.

Details

కిందాబి శ్రీకాంత్ నిష్క్రమణ

ఇక శ్రీకాంత్‌ 14-21, 22-20, 9-21తో కొడయ్‌ నరవొక (జపాన్‌) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్ లో ఆరోసీడ్ సాత్విక్, చిరాగ్ జోడీ 21-13, 21-11తో జిన్‌ జాంగ్‌, నా సుంగ్‌ సియుంగ్‌పై గెలిచి క్వార్టర్స్‌కి అర్హత పొందింది. మరో ప్రిక్వార్టర్స్‌లో సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ 15-21, 17-21తో దెజాన్‌- గ్లోరియా (ఇండోనేసియా) జోడి పరాజయాన్ని చవిచూశారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జోడీ ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చి టోర్నీ నుంచి వైదొలగింది.