Page Loader
Wimbledon 2025 : ఫస్ట్ వింబుల్డన్ టైటిల్‌తో సినర్ చరిత్ర.. భారీ ప్రైజ్‌మనీ ఎంతంటే?
ఫస్ట్ వింబుల్డన్ టైటిల్‌తో సినర్ చరిత్ర.. భారీ ప్రైజ్‌మనీ ఎంతంటే?

Wimbledon 2025 : ఫస్ట్ వింబుల్డన్ టైటిల్‌తో సినర్ చరిత్ర.. భారీ ప్రైజ్‌మనీ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ విజేతగా ప్ర‌పంచ నెంబర్ వన్, ఇటలీ ఆటగాడు జానిక్ సినెర్ నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌ను 4-6, 6-4, 6-4, 6-4 స్కోరుతో ఓడించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో గత నెల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి సినెర్ ఘన ప్రతీకారం తీర్చుకున్నాడు. మరోవైపు ఈ ఫైనల్ ఓటమితో హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్ సాధించాలని కలలుగన్న అల్కరాజ్‌ ఆశలు చిగురించకముందే చిగురించిపోయాయి. సుమారు మూడు గంటల నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌ ప్రారంభంలో సినెర్ ఆకర్షణీయ ఆటతీరుతో దూసుకెళ్లాడు.

Details

రూ.34 కోట్ల ప్రైజ్ మనీ

తొలి సెట్‌లో 4-2 ఆధిక్యంలో ఉన్న సమయంలో గ్రేమ్‌లో బ్రేక్ పొందినా, పుంజుకున్న అల్కరాజ్ బలమైన బేస్‌లైన్ ఆటతో తిరిగి రాణించి ఆ సెట్‌ను 6-4తో ఖాతాలో వేసుకున్నాడు. అనంతర మూడు సెట్లు వరుసగా 6-4, 6-4, 6-4తో గెలుచుకుంటూ తన తొలి వింబుల్డన్ ట్రోఫీని ఎగురవేశాడు. గేమ్‌ గణాంకాల్లోనూ ఇద్దరి మధ్య ఆసక్తికర పోటీ కనిపించింది. అల్కరాజ్ ఈ మ్యాచ్‌లో 15 ఏస్‌లు సంధించగా, 7 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. సినెర్ మాత్రం 8 ఏస్‌లు హక్కించి కేవలం రెండు డబుల్ ఫాల్ట్స్ మాత్రమే చేశాడు. విజేతగా నిలిచిన సినెర్‌కు రూ. 34 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుండగా, రన్నరప్‌గా నిలిచిన అల్కరాజ్‌కు రూ. 17.65 కోట్లు ప్రైజ్‌మనీ అందనుంది.