Page Loader
Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వ‌న్డే మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

Smriti Mandhana: స్మృతి మంధానకు ఐసీసీ వ‌న్డే మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. 2024లో స్మృతి వన్డే క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో మెరవడంతో ఈ గుర్తింపు దక్కింది. గత ఏడాది ఆమె రన్‌మెషీన్‌గా మారి కేవలం 13వన్డే మ్యాచ్‌లలోనే 747పరుగులు సాధించింది. భారత జట్టు విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ 3-0తేడాతో గెలవడంలో స్మృతి కీలకంగా నిలిచింది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి వన్డేలో సెంచరీ చేసి మెరిపించింది. అలాగే,డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీతో తన క్రీడా నైపుణ్యాన్ని చాటింది. మహిళా వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి మందానా కొత్త స్టాండ‌ర్డ్‌ను నెల‌కొల్పింది.

వివరాలు 

 95.15 స్ట్రయిక్ రేట్‌

ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అవతరించింది. 2024లో ఆమె 13 మ్యాచుల్లో 747 పరుగులు చేయడంతో మహిళల వన్డేల్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచింది. లౌరా వోల్వార్డ్ 697పరుగులతో,టమ్మీ బీమౌంట్ 554పరుగులతో,హేలే మాథ్యూస్ 469పరుగులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్మృతి మందానా 57.86 సగటుతో బ్యాటింగ్ చేసి, 95.15 స్ట్రయిక్ రేట్‌ను నమోదు చేసింది. దూకుడు ఆటతీరుతో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందింది. గత ఏడాది స్మృతి నాలుగు వన్డే సెంచరీలు సాధించి మహిళల క్రికెట్‌లో కొత్త రికార్డు సృష్టించింది. 2024లో వన్డే మ్యాచ్‌లలో 100కిపైగా బౌండరీలు బాదింది. వీటిలో 95 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐసీసీ చేసిన ట్వీట్