Loading...
Smriti Mandhana: భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన.. కెప్టెన్సీపై తొలి స్పందన ఇదే..

Smriti Mandhana: భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన.. కెప్టెన్సీపై తొలి స్పందన ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
10:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధానను బీసీసీఐ నియమించింది. ఇప్పటివరకు జట్టుకు సారథ్యం వహించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో మంధానకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తూ బీసీసీఐ ప్రకటన చేసింది. ఈ నిర్ణయంపై స్మృతి మంధాన స్పందిస్తూ.. తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ అందించిన సేవలను ప్రశంసించింది.

వివరాలు 

కొత్త బాధ్యతపై స్మృతి మంధాన ఏమన్నారంటే..

భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం తనకు ఎంతో ప్రత్యేకమైన గౌరవమని స్మృతి మంధాన పేర్కొంది.

ఈ బాధ్యత తనకు దక్కడం ఎంతో విలువైన విషయంగా భావిస్తున్నానని తెలిపింది.

తనపై నమ్మకం ఉంచి, మద్దతుగా నిలిచిన బీసీసీఐ,సెలక్టర్లు,సహచర క్రికెటర్లు సహా ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.

ఇన్నేళ్లుగా భారత జట్టుకు సారథ్యం వహించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేవలను మంధాన కొనియాడింది.

ఎంతో నిబద్ధతతో ఆమె జట్టును ముందుండి నడిపించిందని ప్రశంసించింది.

హర్మన్‌ చేసిన కృషిని తాను ఎంతో గౌరవిస్తానని పేర్కొంది.కెప్టెన్‌గా తనపై పడే బాధ్యతల గురించి పూర్తిగా తెలుసునని స్మృతి మంధాన స్పష్టం చేసింది.

ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత, బాధ్యతలను అర్థం చేసుకున్నానని చెప్పింది.

వివరాలు 

మంధానకు బీసీసీఐ శుభాకాంక్షలు

భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానని మంధాన వెల్లడించింది.

స్మృతి మంధానను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమించడంపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త బాధ్యతల్లో మంధాన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..

ADVERTISEMENT