
Smriti Mandhana: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో స్మృతి మంధాన
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒక్కసారిగా వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మొదటి స్థానంలో నిలిచింది. 2019 తర్వాత మళ్లీ ఆమె ఈ స్థాయికి చేరడం గమనార్హం. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్ (Laura Wolvaardt) ఇటీవల 19 రేటింగ్ పాయింట్లను కోల్పోవడం వల్ల స్మృతికి టాప్ ర్యాంక్ చేరుకోవడానికి అవకాశమొచ్చింది. ప్రస్తుతం స్మృతి మందాన 727 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ నటాలీ స్కీవర్-బ్రంట్ 719 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Details
15వ స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్
వోల్వార్డ్ కూడా 719 పాయింట్లే ఉన్నా, తక్కువ మ్యాచులు ఆడడం వలన మూడవ స్థానానికి పరిమితమైంది. భారత బ్యాటర్లలో స్మృతి తర్వాతి స్థానాల్లో జెమీమా రోడ్రిగ్స్ (14వ స్థానం), హర్మన్‌ప్రీత్ కౌర్ (15వ స్థానం) ఉన్నారు. వీరిద్దరూ కూడా టాప్-20లో నిలవడం భారత మహిళా క్రికెట్‌కు గర్వకారణంగా మారింది. ఈ ర్యాంకింగ్స్ ఫలితంగా స్మృతి మందాన మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన పటిమను రుజువు చేసిందనే చెప్పాలి.