ఇంతకీ జోష్ టంగ్ ఎవరు.. ఇంగ్లండ్ జట్టులోకి ఎలా వచ్చాడంటే?
జూన్ 1 నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య లార్డ్స్ లో టెస్టు సిరీస్ ప్రారంభం అవ్వనుంది. అయితే దేశీయ క్రికెట్లో వోర్సెస్టర్ షైన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోగ్ టంగ్ ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేయనున్నారు. ఈ యువకుడు మెరుగైన ఆటతీరును చుసిన ఇంగ్లండ్ బోర్డు ఈ సిరీస్ లో అతనికి చోటు కల్పించింది. నవంబర్ 15,1997న జోష్ టంగ్ జన్మించాడు. అతను 2016లో గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ అరంగేట్రంలో ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ కుడిచేతి పేసర్ ఇంగ్లండ్ U-19కి, ఇంగ్లాండ్ లయన్స్ తరుపున ఆడిన విషయం తెలిసిందే. తాము చాలా కాలంగా జోష్ ఆటను పర్యవేక్షిస్తున్నామని, అతను టెస్టుల్లో ఆడటానికి అర్హుడని సెలక్టర్ ల్యూక్ రైట్ అన్నారు.
జోష్ టంగ్ నమోదు చేసిన రికార్డులివే
ఇప్పటివరకు జోష్ టంగ్ 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, 26.04 సగటుతో 162 వికెట్లను తీశాడు. ఇందులో ఏడుసార్లు నాలుగు వికెట్లు తీసి రికార్డుకెక్కాడు. 15 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 16 వికెట్లు, ఏడు T20 మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఐర్లాండ్ తో తలపడే ఇంగ్లండ్ జట్టు ఇదే బెన్ స్టోక్స్ (సి), జేమ్స్ ఆండర్సన్, జోనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, క్రిస్ వోక్ , మార్క్ వుడ్, జోష్ టంగ్.