Page Loader
Jasprit Bumrah: కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం చెబుతుంది.. జస్ప్రిత్ బుమ్రా  
కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం చెబుతుంది.. జస్ప్రిత్ బుమ్రా

Jasprit Bumrah: కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం చెబుతుంది.. జస్ప్రిత్ బుమ్రా  

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా (Team India) స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరుఫున ఆడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా ముంబై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ప్రస్తుతం బుమ్రా ముంబైని వీడితున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జస్ప్రిత్ బుమ్రా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో బుమ్రా ఒక్క పోస్టుతో తన సమధానాన్ని తెలిపాడు. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే సరైన సమధానం అనే కొటేషన్‌ను బుమ్రా షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ బుమ్రా మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

Details

ముంబై ఇండియన్స్ ను ఆన్ ఫాలో చేసిన బుమ్రా

ముంబయి ఇండియన్స్ భవిష్యత్తు కెప్టెన్‌గా ఆశలు పెట్టుకున్న బుమ్రా, హార్దిక్ పాండ్యా రాకతో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అతని రాకతో కెప్టెన్సీ అవకాశాలు మూసుకుపోయాయని భావించినా బుమ్రా, వేరే జట్టులోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను బుమ్రా అన్ ఫాలో చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. మరోవైపు బుమ్రా ఆర్సీబీ కాని, గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.