LOADING...
Arjun Tendulkar: తండ్రి బాటలోనే తనయుడు.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ఘనత
తండ్రి బాటలోనే తనయుడు.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ఘనత

Arjun Tendulkar: తండ్రి బాటలోనే తనయుడు.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ కుమారుడు, ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 వికెట్లు పూర్తి చేసి తన కెరీర్‌లో ప్రత్యేక ఘనతను నమోదు చేశాడు. రంజీ ట్రోఫీలో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్, మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2022-23 సీజన్‌లో గోవా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అర్జున్, అరంగేట్ర మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. అదే సీజన్‌లో బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. అప్పటి నుంచి బ్యాట్, బంతితో ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లోనే అర్జున్ 13వికెట్లు పడగొట్టడం గమనార్హం.

Details

తండ్రి బాటలో అర్జున్

మొత్తం ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నప్పటికీ, ఈ విషయంలో అతడు తన తండ్రి సచిన్ తెందుల్కర్‌ కంటే ఇంకా వెనుకబడి ఉన్నాడు. సచిన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మొత్తం 71 వికెట్లు సాధించాడు. ప్రారంభంలో ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన అర్జున్, అనంతరం గోవా జట్టుకు మారాడు. ఆ మార్పు తర్వాత అతడి ప్రదర్శనలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోంది. ఐపీఎల్ విషయానికి వస్తే, గతంలో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అర్జున్, 2026 సీజన్‌కు ముందు ట్రేడ్ ద్వారా లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ జట్టులోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Details

రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్

ఇక సచిన్ తెందుల్కర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 46 వికెట్లు, వన్డేల్లో 154 వికెట్లు తీసుకున్న సచిన్, ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఒక వికెట్ సాధించడం విశేషం. ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగించే దిశగా అర్జున్ తెందుల్కర్ అడుగులు వేస్తుండటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Advertisement