Heinrich Klaasen: టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్
ఈ వార్తాకథనం ఏంటి
సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రెడ్-బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ ఫార్మాట్‌లో అతను దక్షిణాఫ్రికా తరపున ఇప్పటివరకు కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు.
2019లో రాంచీలో టీమిండియాపై అరంగేట్రం చేసిన ఈ 32 ఏళ్ల ఆటగాడు ఆ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేశాడు.
ఆ తర్వాత మరో టెస్టు ఆడడానికి నాలుగేళ్ల పాటు ఎదురుచూశాడు. 2023లో స్వదేశంలో జరిగిన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొత్తంగా అతను 13.00 సగటుతో 104 పరుగులు చేశాడు, సిడ్నీలో ఆస్ట్రేలియాపై అతని టాప్ స్కోరు 35.
Details
డీన్ ఎల్గర్ రిటైర్మెంట్
వైట్-బాల్ క్రికెట్‌లో ప్రోటీస్‌కు క్లాసెన్ అందుబాటులో ఉంటాడు. టెస్ట్‌ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని చెప్పాడు.
తన రిటైర్మెంట్ నిర్ణయం సరైందా కాదా అని చాలా ఆలోచించానని చివరికి టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ వెల్లడించాడు.
ఒక వారం వ్యవధిలో రెడ్ బాల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన రెండవ దక్షిణాఫ్రికా ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు.
భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత డీన్ ఎల్గర్ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు.
ప్రధాన కోచ్ షుక్రి కాన్రాడ్ కైల్ వెర్రెయిన్‌తో ముందుకు సాగడంతో క్లాసెన్‌ను భారత సిరీస్ నుండి తొలగించారు.
ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు.