క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడాదంతా క్రీడా టోర్నీలు
ఈ వార్తాకథనం ఏంటి
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతిభ గల క్రీడాకారులకు వెలిక తీసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.
హైదరాబాద్ లో అయా జిల్లా క్రీడా అధికారులతో క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా ఈ అంశంపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి కీలక విషయాలను వెల్లడించారు. క్రీడల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్, మ్యాగజైన్, యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా ఏడాది పాటు నిర్వహించే షెడ్యూల్, స్టార్ ప్లేయర్ల సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్లేయర్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చుదిద్దుతామన్నారు.
details
త్వరలో సీఎం కప్ షెడ్యూల్
నియోజకవర్గాల్లో మైదానాలతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను విజయవంతం చేయాన్నారు.
దీని కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం అయ్యేలా చూడాలని అధికారులు సూచించారు.
త్వరలో సీఎం కప్ షెడ్యూల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
సీఎం కప్ నిర్వహణపై త్వరలో ఉద్యోగ సంఘాలు, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేయడమే తమ లక్ష్యమన్నారు.
ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.