SRH, IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్ జోరు.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది. జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండోసారి గెలిచి డబుల్ పూర్తి చేసింది.
వివరాలు
చితక్కొట్టిన వైభవ్..
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడి ప్రఫుల్ హింగే వేసిన ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదాడు. రెండో ఓవర్‌లో కూడా ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి సిక్సర్లు కొట్టాడు. మూడో ఓవర్‌లో ఇషాన్ మలింగా తెలివైన స్లో డెలివరీకి జైస్వాల్ అవుటైనా, వైభవ్ మాత్రం దాడి కొనసాగించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అనంతరం ధృవ్ జురెల్‌తో కలిసి 112 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టును 228 పరుగుల వరకు తీసుకెళ్లాడు.
వివరాలు
అద్భుతమైన బౌలింగ్ చేశారిలా..
హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 4 ఓవర్లలో 49 పరుగులకు ఒక వికెట్ తీశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఇషాన్ మలింగా 4 ఓవర్లలో 38 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. సకీబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. శివాంగ్ కుమార్ 2 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. నితీశ్ కుమార్ రెడ్డి 2 ఓవర్లలో 20 పరుగులకు ఒక వికెట్ సాధించాడు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ త్వరగా అవుట్ కావడంతో జట్టు 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
వివరాలు
సన్ రైజర్స్ నాలుగో గెలుపు..
10వ ఓవర్‌లో అభిషేక్ శర్మ 29 బంతుల్లో 57 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ క్రీజులోకి వచ్చి ఇషాన్ కిషన్‌తో కలిసి మరో 28 పరుగులు జోడించాడు. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 31 బంతుల్లో 74 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత క్లాసెన్, నితీశ్ రెడ్డి కలిసి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో సలిల్ అరోరా, అనికేత్ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసి ప్లేఆఫ్స్ రేసులో మరింత బలంగా నిలిచింది.