Page Loader
SRH-HCA: SRH..హెచ్‌సీఏ వివాదానికి ముంగిపు.. హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు
SRH..హెచ్‌సీఏ వివాదానికి ముంగిపు.. హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు

SRH-HCA: SRH..హెచ్‌సీఏ వివాదానికి ముంగిపు.. హైదరాబాద్‌లోనే సన్‌రైజర్స్ మ్యాచ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
09:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారికంగా ప్రకటించిన ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. మంగళవారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఈ వివాదానికి ముగింపు పలికామని హెచ్‌సీఏ వెల్లడించింది. ఫ్రీ పాస్‌ల వివాదం ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల కోసం ఫ్రీ పాస్‌ల కేటాయింపులో హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు తలెత్తాయి. హెచ్‌సీఏ అధిక సంఖ్యలో ఫ్రీ పాస్‌లను కోరుతూ తమపై ఒత్తిడి తెస్తోందని సన్‌రైజర్స్ మేనేజర్ ఒక మెయిల్ ద్వారా ఆరోపించాడు. ఈ మెయిల్ మీడియాకు లీక్ కావడంతో, ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది.

వివరాలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం 

ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో,హెచ్‌సీఏ ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. సమావేశం & తీసుకున్న నిర్ణయాలు మంగళవారం ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సన్‌రైజర్స్ ప్రతినిధులు కిరణ్,శరవణన్,రోహిత్ సురేష్‌లు పాల్గొన్నారు. ప్రధానంగా ఫ్రీ పాస్‌ల సమస్యపై స్పష్టత రావడంతో వివాదం ముగిసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం,స్టేడియం కెపాసిటీలో 10% టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌లుగా కేటాయించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది. దీంతో హెచ్‌సీఏకి 3,900 కాంప్లిమెంటరీ పాస్‌లు కేటాయించనున్నారు.హెచ్‌సీఏ ప్రతిపాదనకు ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓ షణ్ముగం టెలిఫోన్ ద్వారా అంగీకారం తెలిపారు.

వివరాలు 

సంయుక్త ప్రకటన 

ఈ సమావేశం అనంతరం, హెచ్‌సీఏ & సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. "హెచ్‌సీఏకు వ్యతిరేకంగా వచ్చిన వార్తల నేపథ్యంలో, సన్‌రైజర్స్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. స్టేడియంలో ప్రతీ కేటగిరీలో 10% టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌లుగా కేటాయించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ప్రేక్షకులకు మెరుగైన అనుభవం అందించేందుకు హెచ్‌సీఏ & ఎస్‌ఆర్‌హెచ్ కలిసి పనిచేస్తాయి" అని తెలిపాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడి స్పందన ఈ సమావేశానికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు హాజరుకాలేదు. అయితే, ఆయన ట్వీట్ ద్వారా ఈ వివాదం ముగిసిందని వెల్లడించారు. అలాగే, ఈ సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు.

వివరాలు 

వివాదం ముగింపు - ఐపీఎల్ 2025 సిద్దం! 

ఈ పరిణామాలతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ - హెచ్‌సీఏ మధ్య వివాదం పూర్తిగా ముగిసింది. ఫ్రీ పాస్‌ల అంశంపై స్పష్టత వచ్చింది. ప్రేక్షకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్,హెచ్‌సీఏ పూర్తి సన్నద్ధమయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జగన్‌మోహన్ రావు చేసిన ట్వీట్