SRH IPL 2025 Squad: టాప్ బౌలర్లు,విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లతో కూడిన పవర్-ప్యాక్డ్ టీమ్
జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఈ వేలంలో 10 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 182 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు, 120 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వేలంలో మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశారు. మన తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ 15 మంది ఆటగాళ్లను తీసుకుంది, దాంతో జట్టులో మొత్తం 20 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వేలం ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ వద్ద రూ.20 లక్షలు మిగిలాయి.
కావ్య మారన్ వ్యూహాత్మక ఎంపికలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఈ సారి పూర్తి ప్రణాళికతో వేలంలో పాల్గొన్నారు. అవసరమైన ప్లేయర్లపైనే దృష్టి పెట్టిన ఆమె, జట్టును పటిష్టంగా తయారు చేశారు. తొలి రోజు దూకుడు చూపించిన కావ్య, టాప్ ప్లేయర్లను సొంతం చేసుకున్నారు. రెండో రోజు చిన్న ఆటగాళ్లను సైతం జట్టులో చేరుస్తూ జాగ్రత్తగా ఎంపికలు చేశారు.
రిటైన్ చేసిన ఆటగాళ్లు & బలమైన జట్టు
వేలానికి ముందు సన్‌రైజర్స్ ఇప్పటికే హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు) వంటి ఆటగాళ్లను రిటైన్ చేసింది. వీరికి తోడుగా కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లు చేరడంతో జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకాన్ని సంతరించుకుంది. ఈ సారి జట్టుకు ఉన్న బలం, సమతుల్యమైన స్ట్రాటజీతో "కప్ మనదే" అని అభిమానులు విశ్వాసంతో ఉన్నారు. 2024లో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్, ఈసారి విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. మహమ్మద్ షమీ: రూ 10 కోట్లు 2. హర్షల్ పటేల్ - రూ 8 కోట్లు 3. ఇషాన్ కిషన్ - రూ 11.25 కోట్లు 4. రాహుల్ చహర్ - రూ 3.2 కోట్లు 5. ఆడమ్ జంపా - రూ 2.4 కోట్లు 6. అథర్వ తైదే - రూ. 30 లక్షలు 7. అభినవ్ మనోహర్ - రూ 3.2 కోట్లు
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
8. సిమర్‌జీత్ సింగ్ - రూ 1.5 కోట్లు 9. జీషన్ అన్సారీ - రూ. 40 లక్షలు 10. జయదేవ్ ఉనద్కత్ - రూ. 1 కోటి 11. బ్రైడన్ కార్సే - రూ. 1 కోటి 12. కమిందు మెండిస్ - రూ. 75 లక్షలు 13. అనికేత్ వర్మ - రూ. 30 లక్షలు 14. ఎషాన్ మలింగ - రూ. 1.2 కోట్లు 15. సచిన్ బేబీ - రూ. 30 లక్షలు బౌలింగ్ బలం: పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా వంటి అగ్రశ్రేణి బౌలర్‌లతో, SRH లీగ్‌లో అత్యంత సమతుల్య బౌలింగ్ శ్రేణులలో ఒకటిగా ఉంది.
భవిష్యత్ విజయానికి బలమైన పునాది
బ్యాటింగ్ పవర్: ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్‌ల జోడింపు జట్టులో విధ్వంసకర హిట్టర్‌లను కలిగి ఉంది. ఆల్-రౌండ్ బ్యాలెన్స్: అభిషేక్ శర్మ, అభినవ్ మనోహర్ వంటి ఆటగాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించగలరు. యువత,అనుభవం: అనుభవజ్ఞులైన ఆటగాళ్లు,నితీష్ రెడ్డి వంటి వర్ధమాన ప్రతిభావంతుల కలయిక భవిష్యత్ విజయానికి బలమైన పునాదిని అందిస్తుంది.