Praful Hinge: ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శన..3 వికెట్లు పడగొట్టాడిలా..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్ ప్రఫుల్ హింగే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి తన జట్టుకు డ్రీమ్ స్టార్ట్ ఇచ్చాడు. ఇదే అతని ఐపీఎల్ డెబ్యూ కావడం విశేషం. దీంతో అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.
వివరాలు
భయపడ్డ రాజస్థాన్ బ్యాటర్లు..
217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ప్రఫుల్ హింగే బౌలింగ్ ముందు RR బ్యాట్స్‌మెన్ పూర్తిగా తడబడిపోయారు. మొదటి ఓవర్ రెండో బంతికే వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన హింగే, మ్యాచ్‌పై తన ముద్ర వేసాడు. కేవలం 15 ఏళ్ల వయసున్న సూర్యవంశీ మొదటి బంతికే డక్‌గా ఔట్ అయ్యాడు. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతడు క్యాచ్‌గా ఔట్ అయ్యాడు.
వివరాలు
ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి రికార్డ్..
అదే ఓవర్ నాలుగో బంతికి ధ్రువ్ జురెల్ వికెట్ కూడా పడింది. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్టంప్స్‌ను తాకడంతో జురెల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత లుహాన్-డ్రే ప్రిటోరియస్ కూడా ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. ఈ ప్రదర్శనతో ప్రఫుల్ హింగే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు తొలి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన సందర్భాలు 32 ఉన్నప్పటికీ, మూడు వికెట్లు తీసిన ఘనత మాత్రం ఇదే తొలిసారి నమోదైంది.