
Hyderabad- IPL Cricket-Delhi: ప్రత్యర్థి జట్ల దుమ్ము దులుపుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ (ఎ ఆర్ హెచ్) (SRH) జట్టు ప్రత్యర్థి జట్టు దుమ్ము దులిపేస్తోంది.
తాజాగా శనివారం రాత్రి ఢిల్లీ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొంది ఢిల్లీని మట్టికరిపించింది.
హైదరాబాద్ క్రికెట్ జట్టుకు వరుసగా నాలుగో విజయం లభించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి నిర్ణీత 20 ఓవర్లకు 266 పరుగుల భారీ స్కోరు చేసింది.
267 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులే చేసి చేతులెత్తేసింది.
SRH Vs Delhi Dare Devils
రెచ్చిపోయి ఆడిన ఎస్ ఆర్ హెచ్ జట్టు ఓపెనర్లు
హైదరాబాద్ క్రికెట్ జట్టు ఇన్సింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడారు.
ఆరు ఓవర్లలో హైదరాబాద్ ఓపెనర్లు 11 సిక్సర్లు, 13 ఫోర్లు కొట్టారు.
ఒక దశలో స్కోరు 300 దాటేస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేవలం 266 పరుగులే చేయగలిగింది.