తదుపరి వార్తా కథనం

SRH vs GT: శుభ్ మన్ గిల్ సెంచరీ; 188పరుగులు చేసిన గుజరాత్
వ్రాసిన వారు
Sriram Pranateja
May 15, 2023
09:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
అహమ్మదాబాద్ లోని నరేంద్ర మొదీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మద్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగుకు దిగిన గుజారాత్ టీమ్, 20ఓవర్లు ముగిసే సమయానికి 9వికెట్లు కోల్పోయి 188పరుగులు చేయగలిగింది.
శుభ్ మన్ గిల్ సెంచరీ (101పరుగులు 13ఫోర్లు, 1సిక్సర్), సాయి సుదర్శన్ 47పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిగతా వారిలో ఎవ్వరు కూడా రెండంకెల స్కోరును చేయలేకపోయారు.
సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ ఒక్కడే 5వికెట్లు తీసుకున్నాడు. అది కూడా నాలుగు వికెట్లు చివరి ఓవర్లోనే తీసుకోవడం గమనించాల్సిన విషయం. మిగతా వారిలో మార్కో జాన్సన్, ఫాజల్ హక్ ఫారూఖీ, నటరాజన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సన్ రైజర్స్ పై 188పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023
మీరు పూర్తి చేశారు