Page Loader
న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీలంక సిద్ధం
2001లో న్యూజిలాండ్ పై చివరిసారిగా వన్డే సిరీస్‌ను గెలుచుకున్న శ్రీలంక

న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి శ్రీలంక సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2023
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల న్యూజిలాండ్ 2-0 తేడాతో శ్రీలంకపై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. తాజాగా మార్చి 25 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు శ్రీలంక సిద్ధమైంది. టెస్టు సిరీస్‌లో జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. టెస్టుల్లో గెలిచి జోష్ మీద ఉన్న న్యూజిలాండ్ అదే ఊపుతో వన్డే సిరీస్ పై కన్నేసింది. వన్డేల్లో శ్రీలంకపై న్యూజిలాండ్ కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ లంకేయులపై న్యూజిలాండ్ 49 వన్డేలను గెలుచుకుంది. 2001లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై శ్రీలంక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 0-3 తేడాతో లంకేయులను 2019లో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను క్లీన్ స్విప్ చేసిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్

ఫామ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు

హెన్రీ నికోల్స్ శ్రీలంకతో జరిగిన ఎనిమిది వన్డేల్లో 220 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్ గతేడాది 15 వన్డేల్లో 558 పరుగులు చేశాడు. పేసర్ లాకీ ఫెర్గూసన్ మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి లంకపై మెరుగైన రికార్డును సాధించాడు. హెన్రీ గతేడాది కేవలం 10 వన్డేల్లో 18 వికెట్లను పడగొట్టిన విషయం తెలిసిందే. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 2022లో 11 వన్డేలు ఆడి 491 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తన చివరి 13 వన్డేల్లో రెండు సెంచరీలు చేశాడు. ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే ఆల్ రౌండర్ ప్రదర్శనతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డే సిరీస్‌లో ఎవరి పైచేయి సాధిస్తారో కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.