ENG Vs SL: ఇంగ్లండ్‌పై శ్రీలంక అద్భుత విజయం
బెంగళూరు వేదికగా ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో శ్రీలంకపై అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టోక్స్ (43), బెయిర్ స్టో (30), మలాన్ (28), మొయిన్ అలీ (15), డేవిడ్ విల్లీ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగిలిన రూట్ (3), బట్లర్ (8), లివింగ్ స్టోన్ (1) దారుణంగా నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3 వికెట్లు తీయగా, మాథ్యూస్, రజిత తలా రెండు వికెట్లు పడగొట్టారు.
హాఫ్ సెంచరీలతో చెలరేగిన సధీర సమరవిక్రమ, పాతుమ్ నిస్సాంక
శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(4), కుశాల్ మెండిస్(11) నిరాశపరిచారు. సదీర సమరవిక్రమ, ఫాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆ జట్టుకు విజయాన్ని అందించారు. సధీర సమరవిక్రమ (70), ఫాతుమ్ నిస్సాంక (67) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లి రెండు వికెట్లు తీశాడు ఈ మ్యాచ్ ఓటమి ఇంగ్లండ్ ఫ్లే ఆశలను సంక్లిష్టం చేసుకుంది. శ్రీలంక 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.