Page Loader
IPL 2025: డెత్ ఓవర్ల రారాజుగా స్టబ్స్‌ అవతారం.. ఐపీఎల్ 2025లో కొత్త చరిత్ర!
డెత్ ఓవర్ల రారాజుగా స్టబ్స్‌ అవతారం.. ఐపీఎల్ 2024లో కొత్త చరిత్ర!

IPL 2025: డెత్ ఓవర్ల రారాజుగా స్టబ్స్‌ అవతారం.. ఐపీఎల్ 2025లో కొత్త చరిత్ర!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 06, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2024లో డెత్ ఓవర్లలో అత్యద్భుతమైన మ్యాచ్ ఫినిషర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు. గతంలో ఎంఎస్ ధోని పేరు వినిపించేది 'గొప్ప ఫినిషర్'గా. కానీ ఇప్పుడు స్టబ్స్ తన అద్భుత ఆటతీరుతో ధోనినే మించిపోయాడు. ఈ సీజన్‌లో 16వ ఓవర్ల నుంచి 20వ ఓవర్ల మధ్య బౌలర్లకు పీడకలగా మారిన బ్యాటర్‌గా స్టబ్స్ చరిత్ర సృష్టించాడు. 2024 ఐపీఎల్ ప్రారంభం నుంచి ట్రిస్టన్ స్టబ్స్ డెత్ ఓవర్లలో 240.25 స్ట్రైక్ రేట్‌తో 382 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇది అతని ఫినిషింగ్ స్కిల్ల్స్‌కు నిదర్శనం. స్టబ్స్ గత సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతని పాత్ర టీమ్ విజయాల్లో కీలకమైంది.

Details

రెండో స్థానంలో టిమ్ డేవిడ్

ఇక రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ఉన్నాడు. అతను 188.88 స్ట్రైక్ రేట్‌తో 340 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఎంఎస్ ధోని 188.41 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. అతని ఆటలో అనుభవం కనిపించినా, స్టబ్స్ మాదిరి మెరుగైన ఫలితాలు సాధించలేకపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 212.31 స్ట్రైక్ రేట్‌తో 293 పరుగులు చేసి నాల్గవ స్థానంలో నిలిచాడు.

Details

నాల్గోవ స్థానంలో శశాంక్ సింగ్

ఇక పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న శశాంక్ సింగ్ 193.79 స్ట్రైక్ రేట్‌తో 281 పరుగులతో ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు. గత రెండు సీజన్లలో తన ఫినిషింగ్ సామర్థ్యాన్ని నిరూపించిన శశాంక్, ఈ జాబితాలో స్థానం సంపాదించడమే కాదు, ఫినిషర్‌గా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఈ గణాంకాలు చూస్తే, ఐపీఎల్ 2024లో ట్రిస్టన్ స్టబ్స్నే 'న్యూ మ్యాచ్ ఫినిషర్'గా పరిగణించాల్సిన అవసరం ఉన్నట్టు స్పష్టమవుతోంది.