
Yashasvi Jaiswal: ఆస్ట్రేలియాపై యశస్వి సెంచరీ.. బద్దలైన రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 205 బంతుల్లో శతకాన్ని బాదాడు.
తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే ఔటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. ఈ సెంచరీతో యశస్వి తన కెరీర్‌లో నాలుగో టెస్టు శతకాన్ని పూర్తి చేశాడు.
యశస్వి, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77)తో కలిసి తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో యశస్వి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Details
యశస్వీ పేరిట నమోదైన రికార్డులివే
1. తొలి 15 టెస్టుల్లో 1500+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా యశస్వీ రికార్డుకెక్కాడు.
2.28 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేసిన యశస్వి, పుజారా సరసన చేరాడు.
3. ఆస్ట్రేలియాలో తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు .
4.ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్‌గా నిలిచాడు. కేవలం 22 ఏళ్ల 330 రోజుల వయసులో ఈ రికార్డు సాధించాడు. కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు) తర్వాత జైస్వాల్ ఈ ఘనతను సాధించాడు.
5. టెస్టుల్లో 23 ఏళ్లు లోపే అత్యధిక సెంచరీలు చేసిన ఐదో భారత బ్యాటర్. యశస్వి ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు.