Page Loader
ఎట్టకేలకు ఐపీఎల్‌లో బోణీ కొట్టిన సన్ రైజర్స్
48 బంతుల్లో 74 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి

ఎట్టకేలకు ఐపీఎల్‌లో బోణీ కొట్టిన సన్ రైజర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఐపీఎల్ సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ గెలుపొందింది. బౌలింగ్ లో మయాంక్ మార్కాండే, బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శిఖర్ ధావన్ బ్యాటింగ్‌తో భయపెట్టినప్పటికీ.. హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ధావన్ (99) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. అయితే పంజాబ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే సన్ రైజర్స్ చేధించింది.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆప్ ది మ్యాచ్

సన్ రైజర్స్ బ్యాటర్లలో హారీ బ్రూక్(13), మయాంక్ అగర్వాల్(21) మరోసారి నిరాశపరిచారు. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ అడుతూ పాడుతూ జట్టును విజయాతీరాలకు చేర్చారు. రాహుల్ త్రిపాఠి 48 బంతుల్లో 74 పరుగులు విజృంభించాడు. అడమ్ మార్ర్కమ్ 21 బంతుల్లో 37 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కెండ్ నాలుగు, మార్కో జాన్సన్, ఉమ్రాన్ మాలిక్ రెండు, భువనేశ్వర్ ఒక వికెట్ పడగొట్టారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, రాహుల్ తలా ఒక వికెట్ తీశారు. 99 పరుగులతో రాణించిన శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.