Page Loader
SRH vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి
సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి

SRH vs DC : సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
06:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో విశాఖపట్నం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఆ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.4ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లిసెస్ 27 బంతుల్లో 50 పరుగులు (3ఫోర్లు, 3 సిక్సర్లు), మెక్ గుర్గ్ 32 బంతుల్లో 38 పరుగులు ( 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ జట్టు సునాయాసంగా విజయాన్ని సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో జీషన్ అన్సారీ 3 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్