Page Loader
SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి
సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి

SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
11:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శనతో వరుస పరాజయాలను మూటకట్టుకుంది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో హ్యాట్రిక్ ఓటములతో చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు (ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), రఘువంశీ 32 బంతుల్లో 50 పరుగులు (ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించడంతో కోల్ కతా భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య చేధనలో హైదరాబాద్ జట్టు 16.4 ఓవర్లలో 120 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Details

చెలరేగిన కోల్ కతా బౌలర్లు

వైభర్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు తీయగా, రస్సెల్ 2, హర్షిత్ రానా, సునీల్ నరైన్ తలా ఓ వికెట్ తీశారు. మెండిస్ 20 బంతుల్లో 27 పరుగులు ( ఒక ఫోర్, రెండు సిక్సర్లు) క్లాసిన్ 21 బంతుల్లో 37 పరుగులు (రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(4), అభిషేక్ శర్మ (2) మరోసారి విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ (2), నితిష్ కుమార్ రెడ్డి (19), అనికేత్ వర్మ (6) నిరాశపరిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాణించిన వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్